రుణమాఫీ 2018 లో అవలంబించిన విధానాలే 2024 లో కుడా అమలు.
– మంత్రి తుమ్మల
2018 రుణ మాఫీ క్రింద 20 వేల కోట్లు ప్రకటించి , 2023 ఎన్నికల సంవత్సరలో 13 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులో 1400 కోట్లు వెనక్కి వచ్చిన కూడా కనీస స్పందన లేని ప్రబుద్ధులు ఈ రోజు మైకు ల ముందుకి వచ్చి మాట్లాడటం విడ్డురంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.
రుణ మాఫీ పధకంలో రేషన్ కార్డ్ కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికము మాత్రమె- మంత్రి తుమ్మల
మా ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయి. కుటుంబ నిర్ధారణ కాగానే రుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు – మంత్రి తుమ్మల
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మోదటి 6 నెలల్లోనే, ఏక కాలంలో 2లక్షల రుణ మాఫీ చేస్తుంటే హర్షించాల్సిన గత ప్రభుత్వ వ్యవసాయ మరియు ఆర్థిక మంత్రులు, ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నించడం చూస్తున్న తెలంగాణ సమాజం ముఖ్యంగా రైతాంగం వీరిని తప్పక అసహ్యించు కొంటారు