మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం.
మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం.
మహిళలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన ట్జీవ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్ అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని పాత చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంలోకి మార్చిన షీ టీమ్స్ మరియు ఎ.హెచ్.టి.యు కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు.
మహిళలపై లైంగిక వేధింపులు,ర్యాగింగ్,ఈవ్ టీజింగ్,బ్లాక్మెయిలింగ్ మరియు ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లా షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చని అన్నారు.ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి కి పిలిచి వారి తల్లీదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.