Tractor : రై రై అంటూ తిరుగుతున్న దమ్ము చక్రాల ట్రాక్టర్లు.
రై రై అంటూ తిరుగుతున్న దమ్ము చక్రాల ట్రాక్టర్లు.
రోడ్లు చెడిపోతున్న అటువైపు చూడని అధికారులు.
కరకగూడెం, ఆగస్టు 2 (శోధన న్యూస్) : కరకగూడెం మండల వ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీలలో దమ్ము చక్రాల ట్రాక్టర్లు నిత్యం పొలాల్లో కంటే రోడ్ల మీదనే ఎక్కువగా తిరుగుతున్నాయి. బీటీ రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్న కనీసం కన్నెత్తి కూడా అధికారులు చూడడం లేదు అని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కరకగూడెం మండలం పూర్తిగా ఏజెన్సీ గ్రామాలు కావడంతో ఐదు సంవత్సరాలకు లేదా 10 సంవత్సరాలకు ఒకసారి రోడ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. వాటిని రక్షించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. గతంలో దమ్ము చక్రాల ట్రాక్టర్లకు పట్టాలు కట్టి రోడ్లు దాటించి పొలాలలోనే ట్రాక్టర్లు ఉంచేవారు కానీ ఇప్పుడు ట్రాక్టర్ యజమానులు మమ్ములను ఎవరు ఏమి చేయరులే అనే ధైర్యంతో ఇష్టానుసారంగా రోడ్లమీద తిరుగుతున్నారు. జరిమానా విధిస్తారు అనే భయం కూడా లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుంది అని ప్రజలు గ్రామ యువకులు తమ మనో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుకుంటున్నారు.