Badradrikothagudem

గోదావరి నీటిమట్టం గంట గంటకు  పెరుగుతుంది.

గోదావరి నీటిమట్టం గంట గంటకు  పెరుగుతుంది.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇంద్రావతి నది,ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా పెరుగుతుందని లోతట్టు గ్రామాల ప్రజలు చర్ల మండలం,దుమ్ముగూడెం మండలం మరియు భాద్రాచలం మండలం లోని ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

గోదావరికి ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి ఉదృతంగా నీరు వస్తున్నందున ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 40 అడుగులకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు.
వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పారు.

అత్యవసరమైతే కంట్రోల్ రూములకు కాల్ చేయాలని చెప్పారు. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. జలాశయాల వద్దకు ప్రజలు రాకుండా పటిష్ట నియంత్రణ చేయాలని చెప్పారు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *