Police Duty: విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదు.
విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదు.
ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని జిల్లా కలెక్టర్, ఎస్పీ కి తెలియజేయాలని,విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, వర్షాకాలం పూర్తి అయ్యేవరకు జిల్లా యంత్రాంగం అందరూ తమ తమ కార్య స్థానంలో ఉండి చిత్తశుద్ధితో పని చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
పెదవాగు ఘటన చాలా బాధాకరమని దీనివల్ల చాలా ఆస్తి నష్టం తో పాటు గ్రామాల్లో పేదలు చాలా ఇబ్బందికర పరిస్థితులను తెలిపారు. అదృష్టవశాత్తు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల ఏ ఒక్క ప్రాణ హాని జరగకుండా చూడగలిగామని,ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులు అందరిని ప్రభుత్వం అన్ని విధాలుగామంత్రి తెలిపారు. కొత్తూరు గ్రామంలో విద్యుత్ ఘాతుకంతో మృతి చెందిన వేణు మురళి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. పెద్దవాగు ఉమ్మడి రాష్ట్రానికి చెందినది కాబట్టి రెండు రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సీజన్లో ఇప్పుడు ఉన్న వరద కు తగ్గట్టుగా పటిష్టమైన డిజైన్ తో శాశ్వత ప్రతిపాదిక పైన ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని మూడు గేట్లు అదనంగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సెలవులపై వెళ్లరాదని, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.