రహదారుల పై గుంతలు పూడ్చడానికి కోల్డ్ మిక్స్ ఉపయోగం .
రహదారుల పై గుంతలు పూడ్చడానికి కోల్డ్ మిక్స్ ఉపయోగం .
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
మేన్ రోడ్డుపై ఉన్న గుంతలను పుడ్చడానికి ట్రాఫిక్ కు అంతరాయము లేకుండా 10 నిమిషాల్లో గుంతలను పుడ్చే రేడిమెడ్ కోల్డ్ మిక్స్ ను కొత్త గూడెం జిల్లా లో మొదటగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం కొత్త గూడెం ద్వారా తీసుకోని వచ్చి మొదటగా అండర్ బ్రిడ్జి క్రింద వర్షాకాలంలో గుంతలు ఏర్పడి నీరు నిలవడం వల్ల ప్రజలకు రాకపోకలు ఇబ్బందులు పడుతున్న గుంతను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమక్షంలో పుడ్పించనైనది.
జిల్లాలోని రహదారులపై గుంటలు లేకుండా ఏర్పాటు చేసే కార్యక్రమం మొదట కొత్తగూడెం మున్సిపాలిటీ నుండి కలెక్టర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ కాపు సీతాలక్ష్మి, కమిషనర్ శేషు మరియు స్థానిక కౌన్సిలర్స్, మున్సిపాలిటీ డి ఈ రవి మరియు సానిటేషన్ ఇన్స్పెక్టర్లుచారీ,చవాన్, జవానులు నవీన్,రవి పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.