అధికారులకు నోటీసులిచ్చాం.
అధికారులకు నోటీసులిచ్చాం.
ప్రాజెక్టు మూడు గేట్లతో 40 వేల క్యూసెక్యుల వరద విడుదల అవుతుందని, 70 వేల క్యూసెక్యులు వచ్చినప్పుడు అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ గండి పడిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ముప్పు జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులకు ఇప్పటికే షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణ మరమ్మతుల కోసం రూ.8 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
భూ కబ్జాలపై సర్వే చేయాలని కలెక్టర్ కు ఆదేశం
పెద్దవాగు ప్రాజెక్ట్ భూములను కొందరు కబ్జా చేశారని స్థానిక రైతులు ఆరోపించగా మంత్రి పొంగులేటి వెంటనే స్పందించారు. వర్షాలు తగ్గాక పూర్తిస్థాయిలో సర్వే చేయించాలని కలెక్టర్ ను ఆదేశించారు.
ఆంధ్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పొంగులేటి.
41 మంది రైతు కూలీలను రక్షించేందుకు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడామని, హెలికాప్టర్ సహాయంతో వారిని కాపాడారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వo తరఫున కృతజ్ఞతలు తెలిపారు.