Gomata: గోమాత నీకేది రక్షణ.. ?
గోమాత నీకేది రక్షణ.. ?
జిల్లాలను దాటుతున్న ఆవుల తరలింపు
మండలంలో చీకటి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు
చీకటి వ్యాపారానికి సహకరిస్తున్న వారెవరు ..?
కరకగూడెం,శోధన న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలో గోమాతల అమ్మకాలు మూడు పూలు ఆరు కాయలుగా చీకటి వ్యాపారం జిల్లాలు దాటుతుంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో అమాయక గిరిజనులు సాధు జంతువులుగా పెంచుకునే ఆవులను తక్కువ ధరలకే కొని వాటిని సూర్యుడు అస్తమించడమే ఆలస్యం వారి పని మొదలు పెడతారు. సుదూర ప్రాంతాల నుంచి వాహనాలను పిలిపించి గిరిజనల వద్ద నుంచి కొన్న ఆవులను గోవధ చేసే వారికి పెద్ద మొత్తానికి అమ్ముకుంటూ వారి చీకటి వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది కానీ మండలంలో ఈ తరహ చీకటి వ్యాపారానికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంపై సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు.
అర్ధరాత్రి రోడ్లమీద హల్చల్
ఇంత జరుగుతున్న మండల అధికారులు దానిపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు పలు అనుమానాలకు వ్యక్తం చేస్తూ బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి రోడ్లమీద కొందరు వ్యక్తులు తిరుగుతూ హల్చల్ చేస్తున్నడంతో ప్రజలు వీరు పోలీసు ద్వారా లేక అసాంఘిక శక్తుల అర్థం కాక బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఉన్నత అధికారులు స్పందించి అర్ధరాత్రి రోడ్లమీద తిరిగే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారు అధికారుల, పోలీసులా, విలేకరుల అర్థం కాక ప్రజలు భయం భయంగా తమ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చీకటి వ్యాపారానికి కొంతమంది వ్యక్తులు బహిరంగంగా ఆ ఏడుగురు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి అమీ మీయాలు అందిస్తే అన్ని మేము చూసుకుంటామని అంటున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంతున్నారు.
కరకగూడెం ఎస్సై రాజేందర్ వివరణ.
గోశాలకు ఎవరైనా గోమాతలను తరలించినట్టయితే తక్షణమే 100కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నామని ఆయన అన్నారు. పశు సంపదను ఎవరైనా అమ్మకాలు చేసిన గోవధకు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాత్రి వేళల్లో ఎవరైనా రోడ్లమీద అసాంఘిక శక్తులు కనిపించిన దారిదోపిడికి పాల్పడిన తక్షణమే ఈ నెంబర్ 87126 82102 కి తెలియజేయాలని ఆయన కోరారు.