బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ జారీ
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ జారీ
హొంగసంద్రలో జరగనున్న బ్రహ్మరథోత్సవం, పల్లక్కి టెంపుల్ ఫెస్టివల్ నేపథ్యంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. హొంగసంద్ర బస్టాప్ నుంచి కోడిచిక్కనహళ్లి జంక్షన్ వరకు ట్రాఫిక్ మళ్లింపులు దారి మళ్లించే అవకాశం ఉందని సూచించింది. జూన్ 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ట్రాఫిక్ ఆంక్షలు
*మడివాలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హొంగసంద్రలో విలేజ్ ఫెస్టివల్ దృష్ట్యా ట్రాఫిక్ సజావుగా సాగేలా ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు.
*బొమ్మనహళ్లి జంక్షన్ నుంచి దేవరచిక్కనహళ్లి, బేగూరు వైపు వెళ్లే ప్రయాణికులు కోడిచిక్కనహళ్లి జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకుని డీ మార్ట్ జంక్షన్ మార్గంలో వెళ్లాలని సూచించింది.
*కోడిచిక్కనహళ్లికి వెళ్లే ప్రయాణికులు పీకే కళయన మండప క్రాస్ వద్ద ఎడమ మలుపు తీసుకుని బేగూరు అంతర్గత రహదారుల గుండా వెళ్లాలి.
*దేవరచిక్కనహళ్లి ప్రధాన రహదారికి చేరుకోవాలంటే ప్రయాణికులు కోడిచిక్కనహళ్లి జంక్షన్ మీదుగా బొమ్మనహళ్లి జంక్షన్ మార్గంలో వెళ్లాలి.