తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అభివృద్ధి చేసే సర్కారు కే ప్రజలు అండగా ఉంటారు | ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

అభివృద్ధి చేసే సర్కారు కే ప్రజలు అండగా ఉంటారు

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ” తీసుకువెళ్లాలి, పినపాక నియోజకవర్గం పై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

శోధన న్యూస్  , భద్రాద్రి కొత్తగూడెం:  కరకగూడెం మండల సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తన స్వగ్రామం కుర్నవల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు  మండలంలోని అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసుకున్న బూత్ కోఆర్డినేటర్ లు మరియు 10 ఓటర్ల ఇన్చార్ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  మాట్లాడుతూఎన్నికలు నవంబర్ 30న ఉన్నందున ప్రతి బూత్ లో బూత్ కమిటీల సమావేశం పెట్టి బూత్ ఇంచార్జ్ 100 ఓట్ల ఇన్చార్ లు ప్రజలలో తిరుగుతూ మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. 40 రోజులు ప్రతీ కార్యకర్త సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లను గుర్తించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ థకాలను ఇంటింటికి వివరించాలని అందుతున్న పథకాలను గుర్తు చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.  పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు, పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి సీఎం కేసీఆర్ ని ఎలాంటి అపోహలకు లోను కావద్దని 100% మనమే గెలుస్తున్నామని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సమృద్ధిగా సాగునీరు ఇస్తుండడంతో రైతులు ఏట రెండు పంటలు పండిస్తూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్లు తెలిపారు. నిరంతరం ఉచిత విద్యుత్ తో వ్యవసాయం పారిశ్రామిక రంగం లో ప్రతి విప్లవం వచ్చింది అన్నారు. అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేదెందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రైతు బీమా , ఉచిత కరెంటు మత్స్యకారులు గొల్ల కురుమలు దళిత బంధు బీసీ మైనార్టీ సంక్షేమాన్ని లబ్ధిదారులకు పార్టీ నాయకులు నేతలు వివరించాలన్నారు.పినపాక నియోజకవర్గం కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎవరు చేయని విధంగా కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేసి రహదారుల నిర్మాణం బ్రిడ్జిలను నిర్మించుకోవడం జరిగింది అన్నారు. ఏజెన్సీ గ్రామంలోని గ్రామాలకు విద్య వైద్యంతో వ్యవసాయ రంగాలలో ముందున్నమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *