నిరుపేద అనారోగ్య విద్యార్థినికి ఆర్థిక సహాయం
నిరుపేద అనారోగ్య విద్యార్థినికి ఆర్థిక సహాయం
చర్ల, శోధన న్యూస్ : వింత వ్యాధితో బాధపడుతున్న ఓ అనారోగ్య నిరుపేద విద్యార్థినికి ఆర్ కె సీడ్స్ యజమాని రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, చీమకుర్తి వీరభద్రం మానవతా హృదయంతో స్పందించి ఆర్థిక సహాయం అందజేశారు.మండల పరిధిలోని ఆర్ కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆకుల పూజిత గత కొంతకాలంగా వింత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మండల సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, చీమకుర్తి వీరభద్రంలు ఆ నిరుపేద విద్యార్థినిని పరామర్శించారు. అనంతరం ఒక్కొక్కరు రూ10వేల చొప్పున రూ.20వేలను ఇటివలే అందజేశారు.ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ నాయకులు, ఆర్కె సీడ్స్ యజమాని రామకృష్ణకు తెలపడంతో చలించిపోయిన ఆయన మానవత్వంతో స్పందించి మంగళవారం బాధితురాలి ఇంటికి వెళ్లి రూ30 వేల ను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుల పూజిత కుటుంబ పరిస్థితులు చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య చికిత్స చేయించుకోలేని ఆ కుటుంబం ప్రతినెల రూ.15వేlu అవసరమవుతుందని కన్నీరు మున్నీరు అవుతూ తెలపడంతో ఎంతో ఆవేదనకు గురి అయ్యామని తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లి విద్యాసాగర్,అలవాల బాలు,సతీష్,పెద్దిరెడ్డి, రుంజ రాజా,సుధాకర్,సంతోష్, భద్రయ్య, రమేష్, కోటేశ్వరరావు, శ్రీకాంత్,సమ్మయ్య,విజయ్, కృష్ణార్జునరావు,సురేష్,బన్ను, భద్రం,తోకల సతీష్,కనితి రజిని, కొమరం రమాదేవి,స్వరూప తదితరులు పాల్గొన్నారు.