ఆధార్ సంస్థ డైరెక్టర్ తోలెం రమేష్ స్కూల్ బ్యాగ్స్ పంపిణి
ఆధార్ సంస్థ డైరెక్టర్ తోలెం రమేష్ స్కూల్ బ్యాగ్స్ పంపిణి
కరకగూడెం,శోధన న్యూస్: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల వలస ఆదివాసి గ్రామం నీలాద్రిపేట అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ పిల్లలకి హైదరాబాద్ వారి సమిష్టి సహస్ర సహకారం తో ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో ఆధార్ సంస్థ డైరెక్టర్ తోలెం రమేష్ స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేశారు, ఆయన మాట్లాడుతూ పిల్లలను ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని ప్రీస్కూల్ కార్యక్రమాల ద్వారా పిల్లలో నైపుణ్యం పెరుగుతుందని పిల్లల తల్లీ దండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్, స్వర్ణలత, ప్రైమరీ స్కూల్ టీచర్ కుమారస్వామి, ఆధార్ సంస్థ సభ్యులు బట్ట బిక్షపతి, రాజబాబు, గ్రామ పెద్దలు సోడి. మాడారం, భీమయ్య గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.