భద్రాద్రి కొత్తగూడెం

క్రీడాకారులందరూ వేసవి శిక్షణ అనంతరం పూర్తి శ్రద్ధతో క్రీడలను  కొనసాగించాలి 

క్రీడాకారులందరూ వేసవి శిక్షణ అనంతరం పూర్తి శ్రద్ధతో క్రీడలను  కొనసాగించాలి 

కలెక్టర్ డాక్టర్ ప్రియాంక 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల బాల బాలికలకు పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ మినీ స్టేడియం నందు ఆదివారం నిర్వహించిన వేసవి క్రీడల శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక డాక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటగా ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించి పిల్లల ఆర్చరీ నైపుణ్యాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం షటిల్ ఇండోర్ స్టేడియంలో పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో తేవాలని ఈ ఈ పంచాయతీరాజ్ మరియు డి వై ఎస్ ఓ నీ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజులపాటు పిల్లలందరూ శ్రద్ధగా వివిధ క్రీడలలో తర్ఫీదు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం, దూర ప్రాంతాల నుండి పిల్లలను ట్రైనింగ్ కోసం తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

675 మంది విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలలో నెల రోజులపాటుశిక్షణ

ఈ శిక్షణ కార్యక్రమంలో675 మంది విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలలో నెల రోజులపాటుశిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్చరీ, బాక్సింగ్, కరాటే, టైక్వాండో, రెజ్లింగ్ తదితర క్రీడల్లో శిక్షణ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.క్రీడాకారులకు కావలసిన వసతుల పట్ల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలో అన్ని ఏర్పాట్లు. చేస్తామన్నారు.అనంతరం వేసవి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ మరియు మెమొంటోళ్లు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి, మైనార్టీ అధికారి సంజీవరావు, ఆఫీస్ సూపర్డెంట్ లు ఉదయ్ కుమార్, తిరుమల రావు, లక్ష్మయ్య క్రీడా సంఘాల ప్రతినిధులు, వేసవి క్యాంపు శిక్షకులు, మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *