భద్రాద్రి కొత్తగూడెం

నకిలీ విత్తనాలమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

ఎవరైనా నకిలీ విత్తనాలమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 564 అవుట్లైట్స్ కేంద్రాల ద్వారా రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల కోరారు. సోమవారం ఆమె పాల్వంచ పట్టణంలోని కిన్నరసాని రోడ్ లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ట్రేడర్స్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి .. దుకాణంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాలు, అలాగే ఫర్టిలైజర్ నిల్వల రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.

– అధికారులతో సంయుక్త బృందాల ఏర్పాటు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరతలేదని, అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, సుమారుగా 4,47411 ప్యాకెట్ల పత్తి విత్తనం జిల్లాలో అందుబాటులో ఉందని, జిల్లా వ్యాప్తంగా 564 ఆథరైజ్డ్ అవుట్లైట్లు ఉన్నాయని, వీటి ద్వారా ప్యాకేజీ విత్తనాలను కొనాలని,రైతులు ప్యాక్ చేసిన విత్తనాలు మాత్రమే కొనాలని, లూజ్ విత్తనాలు, సీల్ తీసిన విత్తనాలు కొనవద్దని ఇలాంటి వాటివల్ల దిగుబడి తక్కువగా రావడం, విత్తనం మొలకెత్తుకఫోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. అలాగే విత్తనాలు కొనే ముందు రైతులు హోలోగ్రామ్ చూసి కొనాలని తెలిపారు. అన్ని రైతు వేదికల ద్వారా రైతులందరికీ వారి వారి వ్యవసాయ భూములకు అనుకూలంగా ఉండే పంటలు వేసుకోవడం, ఎలాంటి విత్తనాలు కొనాలో గత 15 రోజుల నుండి వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారని, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు పంటలను సాగు చేస్తే బాగుంటుందని అన్నారు.

– జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదు.

నకిలి విత్తనాలు అరికట్టడంలో భాగంగా జిల్లాలో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ స్పెషల్ టీములు ఎక్కడైనా విత్తనాలను పక్కదారి పట్టించడం, లేదా కొరత సృష్టించడానికి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు . ఎక్కడైనా విత్తనాలకు కోరత ఉన్నట్టు తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి తగు విత్తనాలను ఏర్పాటు చేయిస్తామని అని పేర్కొన్నారు. వరి, పత్తి, పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా గ్రీన్ మెన్యూర్ కు సంబంధించి అనుకున్న దానికన్నా 25 శాతం అధికంగా ఉన్నాయని, అందువల్ల రైతుల ఎవరు ఆందోళన చెందవద్దని, అపోహలు పెట్టుకోవద్దని ఆమె పునరుద్ఘాటించారు.జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన,వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పాల్వంచ తాసిల్దార్ వివేక్ మరియు సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *