తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

వ్యక్తుల ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందికి  ఘనంగా సన్మానం 

 వ్యక్తుల ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందికి  ఘనంగా సన్మానం

జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ వివిధ సంఘటనలలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను కాపాడిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తికి సీపీఆర్  చేసి అతని ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాగరాజును,మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాయిగూడెం వద్ద గల గోదావరి నదిలో హోలీ రోజున ఈతకు వెళ్లి సుడిగుండంలో చిక్కుకున్న ఇద్దరం వ్యక్తులను కాపాడిన కానిస్టేబుళ్ళు సత్యనారాయణ,వినయ్ లను మరియు డయల్ 100 ఫోన్ రాగానే తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తిని కాపాడి సీపీఆర్  ద్వారా అతని ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ వీరా మరియు హోంగార్డు కృష్ణ లను ఎస్పీ  ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ నిత్యం విధులు నిర్వర్తించడమే కాకుండా ప్రజల ప్రాణాలను స్వయంగా కాపాడటంలో సమయస్ఫూర్తిని,ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రాణాలను కాపాడడం గొప్ప విషయమని అన్నారు.జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరికీ గతంలో సీపీఆర్  మరియు ప్రధమ చికిత్సలపై అందించిన శిక్షణ మూలంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలను కాపాడటం సులువవుతుందని తెలిపారు.తోటి వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని మనమే కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఈ సందర్భంగా అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *