శాంతియుత వాతావరణంలో అభివృద్ధి వేగవంతం ఎస్పీ రోహిత్ రాజు
శాంతియుత వాతావరణంలో అభివృద్ధి వేగవంతం
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఎస్పీ జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
శాంతియుత వాతావరణంలో అభివృద్ధి వేగవంతం
శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.సంఘ విద్రోహక శక్తుల పట్ల కఠినంగా ఉంటూ,సామాన్య ప్రజలలో భరోసా కల్పిస్తూ,ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు.అధికారులు , సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేసి జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో..అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయిమనోహార్,ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపిఎస్,డిఎస్పీలు రెహమాన్,సతీష్ కుమార్,మల్లయ్య స్వామి,సీఐలు వెంకటేశ్వర్లు,నాగరాజు,కరుణాకర్, రమేష్,శివప్రసాద్,సత్యనారాయణ,ముత్యం రమేష్,ఆర్ఐలు సుధాకర్,రవి,నరసింహారావు,కృష్ణారావు,లాల్ బాబు,నాగేశ్వరరావు,ఎస్సైలు,పోలీస్ కార్యాలయ అధికారులు ,పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.