ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగంలో వివరించారు.ఈ వేడుకల్లో జిల్లా ఎస్పి రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డిఆర్డిఓ విద్యచందన వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన కలెక్టర్
రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానం లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.