నిషేధిత గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి
నిషేధిత గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం
నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. సరిహద్దులో ఉన్న ఇతర జిల్లాల రాష్ట్రాల పోలీస్ అధికారులతో సమన్వయం పాటిస్తూ సమాచారాన్ని సేకరించి గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన TSNAB వారి సూచనలతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,చత్తిస్ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల నుండి నిషేధిత గంజాయిని తెలంగాణ,మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలకు నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.నిషేధిత గంజాయి అక్రమ రవాణా గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని ఈ సందర్బంగా ఎస్పీ కోరారు.