నూతన హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకుతాం
నూతన హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకుతాం .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
పాల్వంచ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాఠశాలలలో చేపడుతున్న పనులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తనిఖీ చేశారు. మొదటగా పాల్వంచ మండలంలోని కేశవాపురం ఎంపీపీ ఎస్ పాఠశాల లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మంజూరైన పనులను తనిఖీ చేశారు.
నాణ్యమైన కుళాయిలను ఏర్పాటు చేయాలి .
పాఠశాలల్లో చేసిన మరమ్మతుల పరిశీలించి తాగునీటి కోసం నాణ్యమైన కుళాయిలను ఏర్పాటు చేయాలని రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టి డబ్ల్యూ పిఎస్ తోగూడెం తండా పాఠశాలను తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారు. అక్కడ చేపట్టిన పనులను మంజూరైన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆగ్రహించిన కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ
పాఠశాల పరిశీలనలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ ఏఈఈ హాజరు అవ్వకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేయమని అధికారులను ఆదేశించారు . విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల లో జరుగుతున్న మరమ్మత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు పరిశీలించి ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. త్రాగునీటి వసతులను పరిశీలించి, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
హమాలీ కాలనీ ఎంపీపీ ఎస్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ
అనంతరం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని హమాలీ కాలనీ ఎంపీపీ ఎస్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటానికి గమనించి అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో మంజూరైన నిధులు చేపట్టిన పనులు పరిశీలించారు. తరగతి గదిలో రెండు ఫ్యాన్లు రెండు లైట్లు ఉండటానికి గమనించి, ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను పరిశీలించి, బాల బాలికలకు ఏర్పాటుచేసిన మరుగుదొడ్లకు వెళ్లడానికి ఒకటే దారి ఉండటం గమనించి,రెండు రోజుల్లో మరుగుదొడ్లకు బాల, బాలికలు వెళ్లడానికి వీలుగా మధ్యలో ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థిని, విద్యార్థులకు తాగునీటి కి ఏర్పాటుచేసిన కొళాయిని పరిశీలించి, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. పాఠశాల ఆవరణకు ప్రహరీ గోడ నిర్మించాలని ఆదేశించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు నాలుగు లక్షల నిధులు మంజూరు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని హమాలీ కాలనీ ఎంపీపీ ఎస్ ప్రాథమిక పాఠశాలకు తాగునీరు, విద్యుదీకరణ, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు నాలుగు లక్షల నిధులు మంజూరు చేయటం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 642 పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామని, ఇప్పటివరకు 170 పాఠశాలల్లో అన్ని మరమ్మత్తులు పూర్తి చేసామని అవునన్నా పది రోజుల్లో పెయింటింగ్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. మిగిలిన పాఠశాలలో అన్నిటిని ప్రభుత్వ ఆదర్శాల మేరకు జూన్ 12 పూర్తి చేసి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి నూతన హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకుతామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, పాల్వంచ తాసిల్దార్ వివేక్ ,పాల్వంచ ఎంపీడీవో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.