బాల బాలికల టీం ఛాంపియన్షిప్ హైదరాబాద్
బాల బాలికల టీం ఛాంపియన్షిప్ హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనందకై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న అండర్ 17 బాల బాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ముగిశాయి. టీం ఛాంపియన్షిప్ మరియు వ్యక్తిగత అంశాలలో జరిగిన ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
టీం ఛాంపియన్షిప్ విభాగంలో హైదరాబాద్ బాలబాలికల జట్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచి టీం ఛాంపియన్లుగా నిలిచారు. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి బాలబాలికల జట్లు నిలవగా బాలికల టీం ఛాంపియన్షిప్ లో తృతీయ స్థానాన్ని ఆతిద్య ఖమ్మం జట్టు నిలువగా, బాలుర విభాగంలో టీం ఛాంపియన్షిప్ విభాగంలో నిజామాబాద్ జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది.
వ్యక్తిగత బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన జతిన్ దేవ్ ప్రథమ స్థానం సాధించగా తరుణ్ ద్వితీయ స్థానం సాధించాడు తృతీయ స్థానాన్ని రంగారెడ్డి కి చెందిన అరూష్ రెడ్డి సాధించాడు. బాలికల వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన శశిరిత ప్రధమ శ్రేష్టా రెడ్డి ద్వితీయ చైత్రారెడ్డి ద్వితీయ స్థానం సాధించారు. సోమవారం రాత్రి జరిగిన ముగింపు సభకు ముఖ్యఅతిథిగా జిల్లా యువజన క్రీడల అధికారి ఎం పరంధామరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వరా చారి పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీల పరిశీలకులు మామిడి సంతోష్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ పామర్తి శ్రీనివాస్, సుధీర్, మంజుల, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
* జాతీయ స్థాయికి ఎంపికైన బాల బాలికల వివరాలు *
బాలుర విభాగంలో హైదరాబాద్కు చెందిన జతిన్దేవ్,తరుణ్, దేవాన్సు సింగ్, రిషబ్ సింగ్ రంగారెడ్డికి చెందిన ఆరుష్ రెడ్డి, స్టాండ్ బైలుగా కార్తీక్ తేజ రంగారెడ్డి పి జ్వలిత్ ఖమ్మం ఎంపికయ్యారు.
బాలికల విభాగంలో హైదరాబాద్కు చెందిన డి సుశ్రీత సి శ్రేష్ట రెడ్డి డి చైతరారెడ్డిలు ఎంపికవగా వై అవని రెడ్డి కరీంనగర్ సంగారెడ్డికి చెందిన సిరి చందన ఎంపికౌగా స్టాండ్ బైలుగా ఖమ్మం కు చెందిన నవ్య శ్రీ, ధరణి లు ఎంపికయ్యారు.