పొదెం వీరయ్యని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం
పొదెం వీరయ్యని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యని ఘనంగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సత్కరించారు.
ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు . అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పొదెం వీరన్నకి తగిన గౌరవం దక్కింది.
మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోదెం వీరన్నకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తగ్గిన గుర్తింపు లభించిందని ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
హైదరాబాద్ లో నీ కొండాపురం బొటానికల్ గార్డెన్స్ లో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పొదెం వీరయ్య శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.