పవన ఇంధన శక్తి వెనుకబడటానికి కారణాలేంటి..?
దేశంలో పవన ఇంధన శక్తి వెనుకబడి ఉండటానికి గల కారణాలేంటి..?
– లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం: దేశంలో ఇంధన అవసరాలు తీర్చడంలో పవన శక్తి వెనుకబడి ఉండడానికి కారణాలు ఏమిటి..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పవన శక్తి ఉత్పత్తి ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలేంటి..? అని పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం కోరారు. దీనికి కేంద్ర విద్యుత్, కొత్త పునరుత్పాధక ఇంధనం శాఖల సహాయ మంత్రి శ్రీ పాద్ యశో నాయక్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
పవన శక్తి సామర్థ్యం ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.
2030 నాటికి 500 GW నాన్-ఫాసిల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం పవన మరియు సౌర శక్తితో సహా అన్ని పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తోంది అని తెలిపారు. 2022లో ఏర్పాటుచేసిన మంత్రిత్వ శాఖ టారిఫ్ నిర్ణయానికి సంబంధించిన ఫీడ్-ఇన్ టారిఫ్ మరియు ఇ-రివర్స్ వేలం పద్ధతులపై నివేదిక సమర్పించినట్లు తెలిపారు.
ఇంకా..యూరోపియన్ యూనియన్ సహకారంతో మార్చి 2018లో గుజరాత్, తమిళనాడు తీరంలో ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల కోసం ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిందని తెలిపారు. కొత్త, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం నూతన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోందని వివరించారు.