karakagudem

తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన భద్రాచలం ఆర్టీవో. ప్రజావాణి,ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.

తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన భద్రాచలం ఆర్టీవో.

ప్రజావాణి,ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.

కరకగూడెం,శోధన న్యూస్:
కరకగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించిన భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు. ఈ సందర్భంగా ధరణి వెబ్సైటును స్లాట్ బుకింగ్ విధానాన్ని దగ్గరుండి పరిశీలించి తహశీల్దారు నాగప్రసాద్ కు తగు సూచనలు చేశారు. మండలంలో ఉన్న ధరణి, ప్రజావాణి, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో నిర్లక్ష్యం వహిచ వద్దని త్వరగా పూర్తి చేయాలని తహశీల్దారు కి ఆదేశించారు. మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చూపాలని ఆయన అన్నారు.తహశీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా వారి సమస్యలను పరిష్కరించాలని. ధరణి సమస్యలు ఏవి కూడా పెండింగ్ లో ఉంచవద్దని ఆయన అన్నారు. 27వ తారీకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల సిద్ధం చేయాలని ఆయన కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్నారు. విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు నాగప్రసాద్, డిప్యూటీ తహశీల్దారు సంధ్య, ఆర్ఐలు రాజు ,హుస్సేన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *