రైతులకు ఉపయోగపడే రోడ్లను ఆక్రమిస్తే చూస్తు ఉరుకునేది లేదు.
రైతులకు ఉపయోగపడే రోడ్లను ఆక్రమిస్తే చూస్తు ఉరుకునేది లేదు.
1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చెయ్యాలి.
ఏజెన్సీలో గిరిజనుల జోలికి వస్తే గిరిజనేతరుకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు.
మాజీ ఎమ్మెల్యే చందా.లింగయ్య దొర
కరకగూడెం,శోధన న్యూస్: ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులను సోదర భావంతో బ్రతకనిస్తే గిరిజనులు, రైతులకు ఉపయోగపడేల రోడ్లను కరకగూడెం గ్రామానికి చెందిన గిరినేతర వ్యక్తి ఆ రోడ్డుని ట్రాక్టరుతో దున్నడం అయన పతనానికి నిదర్శనం అని ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే ఆదివాసీ ఉద్యమ నేత చందా.లింగయ్య దోరా హెచ్చరించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2002 సంవత్సరంలో పోలలాకు వెళ్లడం కోసం భూమిని కొనుగోలు చేసి రోడ్డు పోస్తే దానిని అక్రమంగా ట్రాక్టరు సహాయంతో దున్ని ఆ రోడ్డు ను అక్రమించడం సరి కాదన్నారు.
ఇలానే మేము చుసుకుంటు పోతే మా గిరిజనులు భూములు చట్టాలు గిరిజనేత సోదరుల చెప్పు చెతల్లోకి పోవడం కాయమని అన్నారు.అన్ని చట్టాలు తెలిసినా నాకే ఇటువంటి అన్యాయం జరుగుతుంటె ఎమి తెలియని అమాయక గిరిజన ప్రజలను ఏవిదంగా దోచుకుంటున్నారో నిలువేత్తున అర్ధం అవుతుందని తెలిపారు.
గిరిజనేతరులు పోకడలకు వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజలు తలుసుకుంటే మండలంలో ఏ గిజనేతర సోదరులు జీవించలేరని తెలిపారు.ఇప్పటి వరకు అందరిని కూడా సోదర భావంతో చుస్తన్నమని దానిని అవసరగా చేసుకోని గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా అనేక భూ బదలాయింపులు,భవన నిర్మాణాలు కొనసాగుతున్న కలిసిమెలిసి బ్రతకాలని ఇదే కొనసాగుతే భవిష్యత్తులో ఉద్యమం ముంకు సాగుతుందని తెలిపారు. ఇప్పటికైనా రోడ్డుని దున్నిన వ్యక్తి తన పద్దతి మార్చుకోకుంటె తగిన బుద్ది చెప్పక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రంలో ఉమ్మడి పినపాక మండల మాజీ జెడ్పీటీసి చందా.భారతి, చందా.సంతోష్,గిరిజన అభ్యుదయ సంఘం మండల కన్వీనర్ గొగ్గల.రవి,వజ్జా మహేష్ పాల్గొన్నారు.