ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించండి
ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించండి.
బీఆర్‌ఎస్ శ్రేణుల గ్రామాల్లో విస్తృత ప్రచారం.
కరకగూడెం,శోధన న్యూస్ :వరంగల్-ఖమ్మం-నల్గోండగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.శుక్రవారం కరకగూడెం మండలంలోని గొల్లగూడెం,కొత్తగూడెం,చొప్పాల గ్రామాల్లో గ్రాడ్యుయేట్‌ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.బ్యాలెట్ నమూనాలో సీరియల్-3 రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్ పాయం నర్సింహారావు,మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్,పార్టీ నాయకులు జివ్వాజి సమ్మయ్య,కుంజ లక్ష్మయ్య,సుతారి నాగేష్,బట్టా బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.