ప్రశాంతంగా ఓట్లు వేయాలి -హుస్నాబాద్ ఏసిపి సతీష్
ప్రశాంతంగా ఓట్లు వేయాలి
-హుస్నాబాద్ ఏసిపి సతీష్
వరంగల్, శోధన న్యూస్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఆదేశానుసారం బుధవారం హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్,సీఐ కిరణ్ ఎస్ఐ మహేష్ అక్కన్నపేట ఎస్ఐ వివేక్ కోహెడ ఎస్ఐ తిరుపతి కేంద్ర బలగాలు ఎస్ఎస్బి అధికారులు సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని,ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం అని అన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని మరియు ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు.ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేదా డయల్ 100 కాల్ చేయాలని సూచించారు. మద్యానికి,డబ్బులకు, మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, నచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని,గ్రామాలలో ఏ పార్టీ వారు వచ్చి ప్రచారం చేసిన అడ్డుకోవద్దని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రచారాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి(కోడ్ ఆఫ్ కండక్ట్) ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశ పెట్టిన సీ-విజిల్ యాప్ ఎన్నికల పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వేయాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసిన, ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన, అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు యువకులు స్పందించి ఈ యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వీడియోలు, ఫోటోలు,తీసి యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని తెలిపారు.