కేసీఆర్ దళితులను మోసం చేశారు.
కేసీఆర్ దళితులను మోసం చేశారు.
–బిజెపి కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి
మధిర,శోధన న్యూస్: సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని బిజెపి కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి అన్నారు.
ముందుగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత మాట తప్పారని, ఓట్ల కోసం దళిత బందు తెచ్చి ఒక్కరకి కూడా దళిత బందు ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్, దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు అధికారం ఇవ్వలేదని అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ పని చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కింది. తెలంగాణ ప్రజలకు నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కి సెల్యూట్ చేస్తాంఅని, కమిషన్ కోసమే జాలి ముడి ప్రాజెక్టు కట్టారనీ నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని అన్నారు.దళితులకు సముచిత స్థానం కల్పించిన ఘనత బిజెపి పార్టీది
దానికి నేనే ఉదాహరణ అని అన్నారు.