kothagudem

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులకు రివార్డులను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ 

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులకు రివార్డులను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

 కోతగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయిన ఏటూర్ నాగారం-మహాదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడైన కోవాసి గంగా , మహేష్ , జనార్ధన్ మరియు అతడి భార్య సోడి ఉంగి  ఝాన్సీ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన రివార్డులను  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  చేతుల మీదుగా అందజేశారు.వీరిద్దరూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో ఏరియా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఒక్కొక్కరిపై నాలుగు లక్షల రూపాయల రివార్డును ప్రకటించడం జరిగింది.జిల్లా పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ చేయూత” కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ  తెలియజేసారు.లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు.నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేసే చాలా మంది సభ్యులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *