ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో అవకతవకలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో అవకతవకలు
యారో ఏజెన్సీ పై విచారణ ప్రారంభం
ప్రభుత్వ వైద్య కళాశాళ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల మంజూరు అయిన (73) అవుట్సోర్సింగ్ నియామకాల లో అవుకతవుకలు జరిగాయని అందిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా ఉపాధి కల్పనా అధికారిని వేల్పుల విజేత విచారణ ప్రారంభించారు.
కఠిన చర్యలు
జిల్లా వైద్య కళాశాల ను సందర్శించి ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి , ఎందరు నమోదు చేసుకున్నారు, ఎందరు అర్హత సాధించారు మరియు ఎంతమంది ఉద్యోగాలు పొంది అక్కడ విధులు నిర్వహిస్తున్నారు . తదితర వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ రావు ని వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు . విచారణను సత్వరమే పూర్తి చేసి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కి అందజేస్తానని తెలిపారు. పోస్టులు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నియామకం చేయాలని, ఎటువంటి పైకం అయినా తీసుకుని నియామకం చేశారని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.