ఆదివాసి సంస్కృతి అనువుగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసి సంస్కృతి అనువుగా ఉన్న మండలాల్లోని గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలను అభివృద్ధి చేసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రాచూర్యంలోకి తీసుకొని వచ్చి ప్రపంచానికి తెలిసే విధంగా రైన్ వాటర్ టీం మరియు స్టూడియో పంచతంత్ర బృందాలు పర్యటిస్తున్నట్లు రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ సీఈవో కల్పనా రమేష్ అన్నారు.
ఆదివాసి గిరిజనుల ఆచార వ్యవహారాలు సాంస్కృతిక సాంప్రదాయాలు అంతరించిపోకుండా ప్రపంచానికి తెలిసే విధంగా జిల్లాలోనీ పాతకాలపు గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయడం కోసం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధ మరియు గిరిజన తెగలపై ఉన్న ప్రేమానురాగాలు వారి సాంప్రదాయాలు వృద్ధిలోకి రావడానికి ప్రత్యేక సంకల్పంతో రైన్ వాటర్ టీం మరియు స్టూడియో పంచతంత్ర బృందాలను పర్యాటక స్థలాలుగా గుర్తించిన మండలాల్లోని గ్రామాలను పరిశీలిస్తున్నట్లు అన్నారు.
ఈ పర్యటనలో భాగంగా మణుగూరు పుష్కర ఘాట్, పగిడేరు గ్రామంలో ఉన్నటువంటి వేడి నీటి బుగ్గను సింగరేణి ఓపెన్ కాస్ట్లను సందర్శించి డ్రోన్ కెమెరాలతో ఫోటోషూట్ చేయడం జరిగిందని, పగిడేరు వేడి నీటి బుగ్గ ప్రత్యేకత మరియు సింగరేణి ఓపెన్ కాస్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నామని అన్నారు.