ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను వేధిస్తున్నారనే ఆరోపణలు అవాస్తవం
ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను వేధిస్తున్నారనే ఆరోపణలు అవాస్తవం
ఖండించిన సింగరేణి సెక్యూరిటీ గార్డులు అన్నదమ్ముల్లా కలిసి ఉందాం.
మణుగూరు:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మణుగూరు ఏరియా ఎస్ అండ్ పిసికి అనుబంధంగా విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను సింగరేణి పర్మినెంట్ గార్డులు వేధిస్తున్నారనే పత్రికల్లో వచ్చిన ఆరోపణలను పర్మినెంట్ సెక్యూరిటీ గార్డులు ఖండించారు, గురువారం జమేదార్ లు, గార్డులు పత్రికా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు తమకు సొంత తమ్ముళ్లు లాంటివారని సింగరేణి సంస్థ ఆస్తులు పరిరక్షణలో, కాపాడటంలో కూడా తమతోపాటు ప్రైవేటు గార్డుల సేవలు ప్రశంసనీయమని వారికి వ్యక్తిగతంగా కూడా ఏ ఆపద వచ్చినా తోడబుట్టిన అన్నయ్యలుగా తాము ఎల్లవేళలా తోడుగా ఉంటామని ఇంతకు ముందు కూడా ఉన్నామని గుర్తు చేశారు, కొంతమంది పర్మినెంట్ పోస్టులు తమకే కావాలని ఒత్తిడి చేస్తున్నారని విధి నిర్వహణలో సింగరేణి తల్లి ముందు అందరూ సమానమేనని అని మాత్రమేనని తాము అన్నామని దాన్ని దృష్టిలో ఉంచుకొని సంస్థకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులతో పర్మినెంట్ గార్డులపై అవాస్తవ ఆరోపణలు చేయటం తగదని వారు హితవు పలికారు.
ఏమైనా మనస్పర్ధలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవటానికి పర్మినెంట్ గార్డులుగా తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని వారి పట్ల చిన్నచూపు తమకు ఏ కోశానా లేదని మరొకసారి గుర్తు చేశారు, ఇలాంటి ప్రకటన ఫలితంగా గార్డులపై సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అవి గమనించాలని వారు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి పర్మినెంట్ చెమదార్లు, ఆర్ వెంకటేశ్వర్లు, రాంబాబు,వెంకటేశ్వర్లు గార్డులు జయరాజు, సురేందర్, కనుకుంట్ల రాజు, కిరణ్ కుమార్, రమేష్, నవీన్ బాబు, షడ్రక్ బాబు, బాలాజీ, కొంతమంది గార్డ్స్ పాల్గొన్నారు.