ఆదర్శ నేత, పోరాట స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ .. ఒక విప్లవం
ఆదర్శ నేత, పోరాట స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, న్యూస్ నెట్వర్క్ జనరల్ మేనేజర్ పసునూరి భాస్కర్
మణుగూరు : పవన్ కళ్యాణ్ ఒక విప్లవమని, నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం సాగించిన ఆయన త్యాగంతో ప్రజల మన్ననలు పొందారని ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, న్యూస్ నెట్ వర్క్ జనరల్ మేనేజర్ పసునూరి భాస్కర్ కొనియాడారు. బుధవారం మణుగూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో సంఘం కార్యాలయాన్ని పసునూరి భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి,లాంఛనంగా ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పడి లేచిన కెరటంలా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కోసం, ఆయన చేసిన కృషిని అభినందించారు. అతితక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్ పరిణతి చెందిన రాజకీయ ఉద్దండునిగా తనను తాను మార్చుకున్న తీరు, అందుకోసం ఆయన చేసిన కృషి, పట్టుదల, పోరాటం యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని, పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బేతంచర్ల వెంకటేశ్వరరావు, మల్లేమొుగ్గల రంగారావు , అడపా వెంకటేశ్వర రావు , కోటేశ్వర రావు ,బడే రాం మోహన్ -పాల శ్రీను పవన్ కళ్యాణ్ అభిమానులు వందలాది మంది పాల్గొన్నారు.