సింగరేణి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించాలి
సింగరేణి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించాలి
సింగరేణి పాఠశాల పివి కాలనీ కాంటాక్ట్ ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టుల భర్తీలో పారదర్శకత పాటించాలనీ అర్హులకు న్యాయం చేయాలనీ కోరుతూ మణుగూరు కు చెందిన సామాజిక కార్యకర్త కర్నే బాబురావు ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్ వినతిపత్రం అందజేశారు.
సింగరేణి హై స్కూల్ లో ఉపాధ్యాయుల మరియు సిబ్బంది పది పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ లో భర్తీకి సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నోటిఫికేషన్ ఇచ్చారనీ.. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా వచ్చాయని తెలిసిందనీ పోస్టుల భర్తీ పారదర్శకంగా అర్హులకు కాకుండా పైరవీలకు పెద్దపీట వేస్తూ బ్యాక్ డోర్ లో ప్రయత్నాలు నడుస్తున్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో మేమే మీకు ఫోన్ చేస్తామని అధికారులు చెప్పారని కానీ అందుకు విరుద్ధంగా పాఠశాలలో తమ అనుకున్న వారితో గుట్టు చప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయనే గుసగుసలు వినపడుతున్నాయన్నారు.
ఇదే నిజమైతే అర్హులకు తీరని అన్యాయం జరిగినట్లేనని అన్నారు. సమర్ధులను పక్కన పెడితే దీని ప్రభావం విద్యార్థుల ఎడ్యుకేషన్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనీ ఆయన అభిప్రాయపడ్డారు.అలా కాకుండా పారదర్శకంగా పోస్టుల భర్తీకి తగు చర్యలు చేపట్టాలని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఉన్న మంచి పేరుకు అపప్రద తేవద్దని దీనికై తగు చర్యలు చేపట్టాలని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ అధికారులను కోరారు.