muluguTelangana

పిల్లలు తల్లీ తండ్రులకు భారం కాకూడదు

పిల్లలు తల్లీ తండ్రులకు భారం కాకూడదు

నిరుద్యోగ యువతీ యువకులకు చక్కటి అవకాశం కల్పించినం సద్వినియోగం చేసుకోవాలి

ఘనంగా రాహుల్ గాంధీ  పుట్టిన రోజు వేడుకలు

కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క 

ములుగు : ములుగు మండలం లోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో మంత్రి వర్యులు సీతక్క  చొరవతో 52 కంపెనీల తో మెగా జాబ్ మేళా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర,జిల్లా ఎస్పీ శభరిష్,అడిషనల్ కలెక్టర్ శ్రీజ మాట్లాడారు.

తల్లీ తండ్రులకు ధైర్యంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలి .

మారుమూల గ్రామాలలో ఎక్కడ చూసిన నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక కన్న తల్లీ తండ్రులకు భారంగా కాకూడదు అనే ఉద్దేశం తో ఈ యొక్క మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని మనల్ని గుండెల మీద పెంచి పోషించిన తల్లీ తండ్రులకు ధైర్యంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని ములుగు వెనకబడిన జిల్లా అని ఎవ్వారి నోట వినపడకూడదు అని ములుగు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే భాధ్యత నాదని త్వరలోనే ములుగు జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకుల కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మంత్రి వర్యులు సీతక్క  అన్నారు.


 జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ డాక్టర్ శాభరిష్ మాట్లాడుతూ..

మేము నిరుపేద కుటుంబం లో పుట్టిన మా తల్లీ తండ్రులు కష్ట పడి మమ్ముల చదివించారు అని తల్లీ తండ్రులకు పిల్లలు భారం కాకూడదు అని ఎక్కడ పని చేసిన ఇష్టపడి పని చేయాలని ఎంత జీతం అని కాకుండా మనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ యొక్క అవకాశాలను మెరుగుపర్చుకోవాలని ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన మంత్రి వర్యులు సీతక్క గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి గొప్ప కార్యక్రమాల్లో మేము భాగస్వామ్యం కావడం సంతోషమని వారు అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *