ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
ఘనంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభా కాంక్షలు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క తెలిపారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఈ దేశం లో ఉన్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన నాయకుడు రాహుల్ గాంధీ పుట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి శుభా కాంక్షలు తెలిపారు.అనంతరం మంత్రి వర్యులు సీతక్క మాట్లాడుతూ..ఈ దేశం లో నిరుద్యోగ వ్యవస్థ ను నిర్మూలించడం కోసం తన పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల కోసం గత 10 యేండ్లు గా పోరాటం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది రాహుల్ గాంధీ ఉద్దేశం అని మంత్రి సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.