దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం వాదించే కీలక నేత నారా చంద్రబాబు నాయుడు.
దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం వాదించే కీలక నేత నారా చంద్రబాబు నాయుడు.
దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం వాదించే టీడీపీ అధినేత, ఎన్డీయే కీలక నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రక్క రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల మధ్య సంబంధాల బలోపేతానికి సహకరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ, మన హక్కులను పరిరక్షిస్తూ కేంద్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం తనకుందని స్టాలిన్ పేర్కొన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు దేశ రాజధానికి రాగా.. స్టాలిన్ బీజేపీ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్నారు.