లోక్ సభ ఎన్నికల్లో రికార్డును బద్దలు కొట్టిన రాహుల్ గాంధీ.
లోక్ సభ ఎన్నికల్లో రికార్డును బద్దలు కొట్టిన రాహుల్ గాంధీ.
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి చారిత్రాత్మక విజయం సాధించడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన నానమ్మ ఇందిరాగాంధీ,తండ్రి రాజీవ్ గాంధీల ఎన్నికల విజయాల రికార్డులను బద్దలు కొట్టారు. రాహుల్ తల్లి సోనియాగాంధీ గెలిచిన ఎన్నికల సంఖ్య సమానం .. ఆరు సార్లు గా నిలిచింది.
రాహుల్ ను దత్తత తీసుకోండి.
ఓటింగ్ కు రెండు రోజుల ముందు మే 18న ఐటీఐ మైదానంలో రాయ్ బరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ స్పీచ్ ను ఇచ్చారు .నా కొడుకును అప్పగిస్తున్నాను. మీరు నన్ను అంగీకరించిన విధంగానే రాహుల్ ను దత్తత తీసుకోండి. నేను ఉన్నా లేకపోయినా రాహుల్ మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచడు అని ఆమె అన్నారు. సోనియా మాట కోసం ఓటర్లు రాహుల్ కు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.
ఈసారి ఆరు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి రాహుల్ గాంధీ రికార్డు సృష్టించారు. రాయ్ బరేలీలో తన తల్లి వారసత్వాన్ని కూడా కాపాడారు. తల్లి,నానమ్మ,తండ్రి కంటే రాహుల్ గాంధీ అత్యధిక ఓట్లు సాధించి విజయం సాధించారు.
రాయ్ బరేలీ నుంచి.. తరతరాలుగా వస్తున్న ఆచారం
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1967, 1971, 1980లో రాయ్ బరేలీ నుంచి, రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991 వరకు నాలుగుసార్లు అమేథీ నుంచి గెలిచారు. రాయ్ బరేలీ స్థానం నుంచి సోనియాగాంధీ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2024లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత సోనియా తన వారసత్వ సీటును కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు.