పవన్ కళ్యాణ్ గెలుపు ఫై బారీ బెటింగులు
పవన్ కళ్యాణ్ గెలుపు ఫై బారీ బెటింగులు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గోదావరి ప్రాంతంలో, ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల అవకాశాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం దాటిన తర్వాత ఎట్టకేలకు ఈసారి తొలి విజయాన్ని నమోదు చేస్తారు .. ఎంత తేడాతో గెలుస్తారు.. లేదా ఓడిపోతారు? గోదావరి ప్రాంతంలో జనసేన ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుంది? ఇవే ప్రధాన ప్రశ్నలపై పందెందారులు భారీ మొత్తంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ 2019లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు .ఈసారి ఆయన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాకినాడ ఎంపీ, అధికార వైసీపీ అభ్యర్థి వి గీతపై పోటీ చేశారు.
పవన్ కళ్యాణ్ ఎంత తేడాతో గెలుస్తారు.. లేదా ఓడిపోతారు?
పందెందారులు భారీ మొత్తంలో బెట్టింగ్లు కడుతున్నారు. ఒకటికి ..ఐదు శాతం అంటే పవన్ కళ్యాణ్ గెలుపు , ఓటమి ఫై బారీగా బెట్టింగ్లు కడుతూ ..తీవ్ర ఉత్కంత ను రాజకీయలో నెలకొపారు.