మహిళల స్వయం సమృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
మహిళల స్వయం సమృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
రంగారెడ్డి : రాజేంద్రనగర్ పంచాయితీ గ్రామీణాభివృద్ధి కార్యాలయం లో జరిగిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అంశం పై సమీక్ష సమావేశం రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల స్వయం స మృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రాష్ట్రంలోని 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం తో పాటు 500 లె గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని మహిళలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షలతో భీమా పధకం అమలు చేస్తున్నాం మహిళలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఈ ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు.
అభివృద్ధిలో వెనకడుగు వేసేది లేదని మంత్రి గారు అన్నారు అధికారులు ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చూడాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తో పాటు డి ఆర్ డి ఓ అధికారులు పాల్గొన్నారు.