BadradrikothagudemTelangana

షెడ్యూల్డ్ తెగల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి 

షెడ్యూల్డ్ తెగల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి

షెడ్యూల్డ్ తెగల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్.టి. కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఐ డి ఓ సి కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన ఎస్పీ రోహిత్ రాజ్  అధికారులతో కలిసి సమీక్ష సమావేశం లో జాతీయ ఎస్.టి. కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు.

ఈ సమావేశం లో ముందుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా లో షెడ్యూల్ తెగల అభివృద్ధికి చేపడుతున్న పనుల గురించి జాతీయ కమిషన్ సభ్యుడికి వివరించారు.అనంతరం జాతీయ ఎస్.టి. కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్డ్ తెగల హక్కుల పరిరక్షణకై అధికారులు కృషి చేయాలన్నారు.

షెడ్యూల్డ్ తెగల సాంఘిక – ఆర్థిక అభివృద్ధికి వివిధ ప్రణాళికల రూపకల్పనకు కృషి చేయాలని, ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలని, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రూపొందించిన ప్రణాళికలను షెడ్యుల్డ్ కులాల వారికి అందేవిధంగా చూడాలని అన్నారు.

ఈ కమిషన్‌కు ఏదైనా కేసును విచారించే విషయంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయని, ఏ చిన్న సమస్యను అయినా నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. అధికారులు తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యపై స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు.

జిల్లా లో వున్న అన్ని మైనింగ్ కాంట్రాక్టు వివరాలు అన్ని పది రోజుల్లో నివేదికలు సమర్పించాలి. ఇది గిరిజన జిల్లా వారికి అన్ని హక్కులు ఉంటాయి, కానీ ఇక్కడ పేరు గిరిజనులది పెత్తనం గిరిజనేతరులు చేస్తున్నారు.  ఈ జిల్లా వాడినే నాకు అన్ని తెలుసు, గిరిజనులు హక్కులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాటశాలలు, కళాశాలలో చదువుకునే విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. వారు ఉన్నతంగా చదివి మంచి స్థాయిలో ఉండే విధంగా వారికి కల్పిస్తున్న సంక్షేమ ఫలాలు సమయానికి అందేలా అధికారులు చూడాలని అన్నారు. అందుకు కమిషన్ తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఎక్కడ కూడా హక్కుల ఉల్లంఘన జరుగకుండా చూడాలని పోలీసు వారికి సూచించారు. అనంతరం వివిధ సమస్యలపై వచ్చిన జిల్లాలోని పలు మండలాల భాదితుల వివరాలు అడిగి తెలుసుకొని వినతులను స్వీకరించి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించారు.

తెలంగాణ లో ప్రధానంగా నాలుగు ఉమ్మడి జిల్లాలు అయినా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ మరియు మహబూబాబాద్ జిల్లా పై ప్రత్యేక దృష్టి పెడతాను అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *