Telangana

రక్తదాన శిబిరం విజయవంతం

రక్తదాన శిబిరం విజయవంతం
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని ఉప్పేడు గొల్లగూడెం గ్రామంలో గుండెల ప్రశాంత్ ఆధ్వర్యంలో గ్రామ యువత ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

స్థానిక చేయూత స్వచ్చంద సంస్థ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని స్థానిక వెంకటాపురం సిఐ బండారి కుమార్ ప్రారంభించగా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ రక్త దాతలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా గ్రామ యువత ఆహ్వానించిన సిఐ బండార్ కుమార్, వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సే మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అని ఆపత్కాలంలో ఉన్న తోటి మనిషికి ప్రాణం పోసే విలువైన సహాయమని అన్నారు.

గ్రామాల్లోని యువత ఉప్పేడు గొల్లగూడెం యువతను ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు వివిధ సేవా రంగాల్లో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాలని కోరారు. యువతలో సేవాభావం పెంపొందిస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు చిడెం సాయి ప్రకాష్, గుండెల ప్రశాంత్, రావుల నాని, గుండెల మధు, కన్నబోయిన నరసింహారావు, తోట పూర్ణ, జాగరి మహేష్, బక్కతట్ల రాజు, బాతట్ల సంతోష్ మరియు గ్రామ యువత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *