BadradrikothagudemTelangana

స్వచ్ఛదనం – పచ్చదనం పనుల పరిశీలన

స్వచ్ఛదనం – పచ్చదనం పనుల పరిశీలన

 ఈనెల 5వ తేదీ నుంచి జరుగుతున్న స్వచ్ఛదనం – పచ్చదనం” పనులను పరిశీలించుటకు నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి విపి గౌతమ్  భద్రాద్రి కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా విద్యానగర్ గ్రామపంచాయతీలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ (వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత)ని పరిశీలించారు.

ఇంకుడు గుంతని ఏ విధంగా తయారు చేశారు.దానికి పట్టిన వరలెన్నీ, నీరు ఎలా ఇంకుతుంది అనే విషయాలని క్షుణ్ణంగా జిల్లా కలెక్టర్ జితేష్  అడిగి తెలుసుకున్నారు. అనంతరం రుద్రoపూర్ గ్రామపంచాయతీలోని హైస్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి మెడిసినల్ ప్లాంట్స్, టాల్ ప్లాంట్స్, స్కూల్ గార్డెన్,కమ్యూనిటీ ప్లాంటేషన్ మొక్కల విశిష్టతను జిల్లా కలెక్టర్ ను గౌతమ్ అడిగి తెలుసుకున్నారు.

తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులకు జిల్లా కలెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి గౌతమ్ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి అభినందించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పశు సంతతి నియంత్రణ కేంద్రం (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ) సందర్శించి అక్కడ తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 27వ వార్డులోని ప్రగతి మైదానంలో మొక్కలు నాటారు.

ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం కూడా గ్రామాలు పట్టణాలలో అదే ఉత్సాహంతో కొనసాగించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *