BadrachalamTelangana

భద్రాచలం ఐటిడిఏ ముందు ధర్నా

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల బెదిరింపులను ఆపాలి .

భద్రాచలం ఐటిడిఏ ముందు ధర్నా ఏపీఓ కి వినతి పత్రం: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

ఎన్నో ఏళ్లుగా పోడు కట్టుకొని జీవిస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ వారి దాడులు ఆపాలని కోరుతూ భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం ముందు ధర్నా చేసి ఏపీవో డేవిడ్ రాజు గారికి వినతిపత్రం సమర్పించారు.


సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు,జిల్లా సహాయ కార్యదర్శి గౌనీ నాగేశ్వరరావు జిల్లా నాయకులు ఎస్ కె ఉమర్ లు మాట్లాడుతూపోడు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని ఆపాలని హరితహారం పేరుతో ఉంచుకున్న భూమిని తిరిగి ఇవ్వాలని ఆదివాసి గ్రామాల్లో ఆపాలని వేరే గ్రామపంచాయతీలు వేరే గ్రామాలలో ప్రకృతి వనం పేరుతో తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని పోడు సాగుదారులపై నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు అన్నారు.

అడవిలో పై హక్కులున్నా ఆదివాసులకు భూములు ఇచ్చే పరిస్థితిలో లేదని పెట్టుబడి దారులకి కార్పొరేషన్ లకి ఇస్తున్నారని వారన్నారు. భూములే ఆధారంగా బ్రతికే ప్రజలు ఎక్కువ ఉన్నారని అలాంటి వారికి ఇవ్వకుండా ఫారెస్ట్ వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని వారన్నారు.

ప్రస్తుతం సాగు చేసుకుంటున్న భూములు కూడా ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలియజేశారు.పోడు భూముల పేరుతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతవరకు పోడు భూముల గురించి పట్టించుకోలేదని ఈ ప్రభుత్వాలు అన్ని పాతసిసాలో కొత్త నీరుల నే పనిచేస్తున్నాయని వారన్నారు తక్షణమే పోడు భూముల సమస్యను పరిష్కరించేటట్టు ఫారెస్ట్ అధికారులు చొరవ చూపాలని వర్క్ కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా డివిజన్ నాయకులు కే సారంగపాణి పొడుగు నరసింహారావు కుంజ కృష్ణ ముసలి సతీష్ ముత్యాల సత్యనారాయణ,గడ్డం లాలయ్య వీరమల్ల ఉమా సోమ వినోద బుర్ర సమ్మక్క నాగమణి అలివేలు చిన్నమ్మాయి భద్రమ్మ మనోజ్ రవి లక్ష్మణ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *