ఏ ఒక్క రైతు అభద్రత భావనకు లోనవ్వొద్దు.
ఏ ఒక్క రైతు అభద్రత భావనకు లోనవ్వొద్దు.
అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో రెవెన్యూ,హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు
అశ్వారావుపేట మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి, నారాయణ పురం,వినాయక పురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు.అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ శ్రీ కల్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు .తెలంగాణా రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు పాలించిన పెద్దోళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు.
కావాలని రైతులను రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తున్నారు.
ఏ ఒక్క రైతు అభద్రత భావనకు లోనవ్వొద్దు.
ఇప్పటికే వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాము.అర్హులైన వారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రుణమాఫీ అయిన ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది.ఇది పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేస్తుంది.రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేదే లేదు కనీసం ప్రతి పక్ష హోదాని కూడా దక్కించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది అంటూ సెటైర్లు వేశారు.