Telangana

పాట ఉన్నన్ని రోజులు గద్దరన్న సజీవంగానే ఉంటాడు

గద్దరన్న బౌతికంగా మన మధ్య లేకపోయిన పాట ఉన్నన్ని రోజులు గద్దరన్న సజీవంగానే ఉంటాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  అన్నారు. 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన తెరాస ఎమ్మెల్యేలను, ఎంపిలపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అభ్యర్థులను పెట్టాలని నిర్ణయిస్తే అది తప్పని వాదించిన వ్యక్తి గద్దర్. తెలంగాణ ఉద్యమానికి, కెసిఆర్ కి అండగా కూడా గద్దర్ నిలబడ్డారు.

తూప్రాన్ లో నీళ్లులేవు హల్దీ వాగులో నుండి వాటిక చెరువు కి లిఫ్ట్ పెట్టాలని గద్దర్ కోరితే..8 నెలల్లో పూర్తి చేసి ఆయనతోనే ప్రారంభించాం. తెలంగాణ వచ్చాక ghmc మున్సిపల్ కార్మికులకు కనీస వెతలు అమలు కావడం లేదని గద్దర్ లెటర్ రాస్తే వారికీ ఎమ్మడే ఒక్క సంతకంతో జీతాలు పెంచిన కెసిఆర్ అది గద్దర్ కి కెసిఆర్ ఇచ్చిన గౌరవం అన్నారు.సిద్దిపేటలో గద్దరన్న విగ్రహం పెట్టడం మాకు చాల గౌరవం. పెట్టించే బాధ్యత నాది, గద్దరన్న జీవిత చరిత్ర పైన ఒక డాక్యుమెంటరీ చేసయ్యండి నేను సహకారం అందిస్తా అన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అవుతున్న ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయి అవ్వి చేరిపోవాలంటే గద్దరన్న ఆలోచలు ముందుకు తీసుకోవాలన్నారు.

ఎప్పటి వరకైతే ప్రభుత్వం ప్రజల ఆలోచలను తీసుకవెళ్లాదో, అణిచివేత్త ఉంటాదో అక్కడ ప్రభుత్వ అవార్డులకు అర్ధం లేదు అనే మాట ఆరోజు గద్దర్ గారు చెప్పారు నేడు నందిని సిద్ద రెడ్డి  తిరస్కరించి చూపించారన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ తల్లి చేతిలో బతుమ్మను మాయం చేసిన రేవంత్ రెడ్డి అవార్డు ఇస్తే తృణప్రాయంగా తిరస్కరించిన నందిని సిద్దారెడ్డి గారు మన సిద్ధిపేట బిడ్డ కావడం నిజంగా గర్వకారణం.. త్వరలోనే గద్దర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక భారీ బహిరంగ సభను సిద్దిపేటలో నిర్వహించుకుందాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *