KhammamTelangana

గణేష్ నిమజ్జనంను అన్ని శాఖలు సమన్వయంతో చేపట్టాలి .

గణేష్ నిమజ్జనంను అన్ని శాఖలు సమన్వయంతో చేపట్టాలి .

ఖమ్మం, ఆగస్టు 30: వినాయక చవితి, గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయంతో పక్కగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి పండుగ, గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..పర్యావరణ హిత మట్టి గణేషులు ప్రతిష్టించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.

పిఓపి విగ్రహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ ఏర్పాట్లు చేయాలని, పెద్ద విగ్రహాల మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకొనేలా కమిటీ ప్రతినిధులకు అవసరమైన సూచనలు అందించాలని, నిమజ్జనం సంబంధించి నిర్దేశించిన ప్రదేశాలలో పూర్తిస్థాయి బారికేడ్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టం త్రాగునీరు, లైటింగ్, మొబైల్ టాయిలెట్ నిర్వహించాలని అన్నారు.

నిమజ్జనం పాయింట్ల వద్ద క్రేన్ లను ఏర్పాటు చేయాలని గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, వారి వివరాలు ముందుగానే జిల్లా యంత్రానికి అందించాలని మత్స్య శాఖ అధికారిని, నిమజ్జన పాయింట్ల వద్ద 108 వాహనాలు, ఏర్పాటు చేయాలని, ప్రతి పాయింట్ వద్ద, అలాగే మండల కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అధికారులు ఉత్సవ కమిటీ మెంబర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని పండుగ, నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి ప్రసాద రావు, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, స్తంభాద్రి ఉత్సవ కమిటీ బాధ్యులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *