రేపు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటన
రేపు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రాపర్తి నగర్ బైపాస్ రోడ్ లోని ఉషాహరి కన్వెన్షన్ హాల్లో జరిగే టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మూడవ రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పర్యటన
పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పర్యటనలో భాగంగా జీళ్ళచెర్వు, కేశవాపురం, ధర్మ తండా, పోచారం, కిష్టాపురం, పాలేరు, ఎర్రగడ్డ తండా, నర్సింహులగూడెం, సంధ్య తండా, లాల్ సింగ్ తండా, గైగొళ్లపల్లి, చౌటపల్లి, బోడియా తండా గ్రామలను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.