పరిగి లో మంత్రి సీతక్క పర్యటన
పరిగి లో మంత్రి సీతక్క పర్యటన
రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. పలు పాలకమండల్ల ప్రమాణ స్వీకరణ మహోత్సవాలకు, భూమి పూజ పనులకు ముఖ్య అతిధిగా హజరయ్యారు.
హైదరాబాద్ నుంచి కుల్కచర్లకు చేరకున్న మంత్రి సీతక్కకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ, కుల్కచర్ల మార్కెట్ కమిటీ సభ్యుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్నాపూర్ చెరువు రోడ్డు పనులకు శంకు స్థాపన చేసిన అనంతరం బంజరా భవన్, మున్సిపల్ బవన ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఏకకాలంలో రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వం సొంతమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్న వడ్లకు రూ.500 బోనస్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అన్నదాతలు పంట మార్పిడికి, వైవిద్యానికి ప్రధాన్యత నివ్వాలని విజ్ఞప్తి చేసారు.