దామెర గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక.
దామెర గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక
కమిటీ అధ్యక్షులుగా కొమ్మిడి లచ్చిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక.
కమిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాను అధ్యక్షులు
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కమిటీ సభ్యులు
హుస్నాబాద్ : ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఏకగ్రీవంగా కొమ్మిడి లచ్చిరెడ్డి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులుగా కొమ్మిడి లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు.
కమిటీ అధ్యక్షులుగా కొమ్మిడి లచ్చిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక.
కమిటీ ఉపాధ్యక్షులు చల్ల నరేందర్ రెడ్డి,మద్దె రాములు,ప్రధాన కార్యదర్శి బొప్పారాజు సురేందర్ రావు,కోశాధికారిగా కొమ్మిడి వెంకన్న,భజన మండలి గుర్రపు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి మంతుర్తి కొమురయ్య యాదవ్,ఆడిటర్ చల్ల ప్రతాప్ రెడ్డి కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు.