సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ట్రైలర్
సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ట్రైలర్
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇది చారిత్రాత్మక రోజు అని ఎన్నో దశాబ్దాల నుండి గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని కొన్ని లక్షల ఎకరాల లో పారటానికి ఇది ముందు అడుగు గా భావిస్తున్నానని నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ కట్టుకు తక్కువ ఖర్చుతో నీరు అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి ఏడాది 6 నుండి 6:30 లక్షల కొత్త ఏర్పాటు చేయడమని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు కాలంలో పై నుండి 35 లక్షల కొత్త ఆయకట్టుకు నీరు అందించడమే మా ప్రభుత్వంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క మరియు క్యాబినెట్ మంత్రుల ముఖ్య లక్ష్యం అని తెలిపారు.
దీనిలో భాగంగానే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ట్రైలర్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా రెండు మరియు మూడు పంప్ హౌస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,అదే రోజు వైరాలో నిర్వహించే బహిరంగ సభలో రైతు రుణమాఫీ కి సంబంధించి రెండు లక్షల రూపాయలు రైతు రుణాలు రైతులకు చెక్కులు అందించే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సీతారామ ప్రాజెక్టుకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నీటి కేటాయింపులు జరగలేదని, అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి గోదావరి జలాల నుండి 67 టీఎంసీల నీరును సీతారామ ప్రాజెక్టుకు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఇది చివరి దశలో ఉన్నదని 10 నుండి 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రి తెలిపారు.